రూపాయి మరోసారి పతనం | Rupee hits new low, breaches 70-mark for first time against US dollar | Sakshi
Sakshi News home page

రూపాయి మరోసారి పతనం

Aug 14 2018 12:47 PM | Updated on Mar 21 2024 7:52 PM

దేశీయ కరెన్సీ రూపాయి మంగళవారం మరింత బలహీనపడింది. చరిత్రలో తొలిసారి అత్యంత దిగువకు పడిపోయింది. డాలర్‌ మారకంలో  రూపాయి విలువ తొలిసారి రూ. 70ని  టచ్‌ చేసింది.  సోమవారం నాటి 68.93  ముగింపుతో పోలిస్తే నేడు ఆరంభంలో  స్వల్పంగా పుంజుకుంది. కానీ  ప్రారంభ లాభాలను కోల్పోయిన రూపాయి డాలరు మారకంలో  0.21 శాతం క్షీణించి 70.07 ను తాకింది.  ఈ  సందర్భంగా కేంద్రబ్యాంకు  రిజర్వ్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా జోక్యం చేసుకోనుందనే  అంచనా మార్కెట్‌ వర్గాల్లో నెలకొంది. రీటైల్‌ ద్రవ్యోల్బణం 9నెలల కనిష్టానికి చేరుకున్న సంగతి తెలిసిందే.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement