మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్‌ ధరలు | Petrol, diesel prices hiked after 19 days as Karnataka elections | Sakshi
Sakshi News home page

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్‌ ధరలు

May 14 2018 12:37 PM | Updated on Mar 21 2024 6:13 PM

పెట్రోల్, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. ముఖ‍్యంగా కర్ణాటక ఎన్నికలు ముగిసిన రెండు రోజుల అనంతరం మళ్లీ భగ్గుమన్నాయి. సోమవారం లీటరుకు పెట్రోల్ ధర 17 పైసలు , డీజిల్ 21 పైసలు   పెరిగింది. దీంతో మరోసారి రికార్డు స్థాయిని తాకాయి.   దాదాపు 19 రోజుల అనంతరం  ఢిల్లీలో పెట్రోలు ధర నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల గరిష్టాన్ని నమోదు చేశాయి.  అటు డీజిల్ ధర  లీటరుకు 66 రూపాయల వద్ద ఆల్‌ టైం హైని టచ్‌ చేసింది.  ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్‌  ప్రకారం.  ఢిల్లీలో లీటరుకు 21 పైసలు, కోలకతాలో లీటరుకు 5 పైసలు, ముంబయిలో 23 పైసలు, చెన్నైలో లీటరుకు 23 పైసలుగా ఉంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement