ఒలింపిక్స్ రజత పతక విజేత సింధు | PV Sindhu gets silver medal in Rio Olympics | Sakshi
Sakshi News home page

Aug 19 2016 9:02 PM | Updated on Mar 22 2024 11:06 AM

కోట్లాది భారతీయుల ఆకాంక్ష నెరవేరలేదు కానీ.. రియో ఒలింపిక్స్లో మరోసారి మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఫైనల్ సమరంలో భారత షట్లర్, తెలుగుతేజం పీవీ సింధుకు నిరాశ ఎదురైనా.. తుదిమెట్టుపై స్వర్ణం చేజారినా.. రజతపతకంతో మెరిసింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి జరిగిన మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్ సమరంలో సింధు పోరాడి ఓడిపోయింది. గంటకుపైగా హోరాహోరీగా సాగిన పోరులో 21-19, 12-21, 15-21 స్కోరుతో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ కరోలినా మారిన్ చేతిలో ఓటమి చవిచూసింది. కాగా ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో రజతం సాధించిన తొలి భారత షట్లర్గా సింధు రికార్డు నెలకొల్పింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement