గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలను వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. విజయవాడ పర్యటనను సగంలోనే ముగించుకుని హుటాహుటిన రాజమండ్రి వెళ్లిన ఆయన.. అక్కడి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఓదార్చారు.