ప్రముఖ ఇంటర్నెట్ దిగ్గజం యాహూ ఖాతాలో మరోసారి పెద్ద ఎత్తున హ్యాక్ అయ్యాయి. గతంలోనే ఒకసారి తమ ఖాతాలు భారీగా హ్యాకింగ్ కు గురయ్యాయని ధృవీకరించిన యాహూ మరోసారి షాకింగ్ న్యూస్ వెల్లడించింది. తమ ఖాతాలపై మరో మేజర్ సైబర్ ఎటాక్ జరిగిందని యాహూ వెబ్ సైట్ లో ప్రకటించింది. దాదాపు 100కోట్ల (1బిలియన్)కు పైగా ఖాతాలు హ్యాక్ అయినట్టు ప్రకటించడం ఆందోళన రేపింది. తమ వినియోగదారుల ఖాతాల నుంచి వ్యక్తిగత సమాచారం అపహరణకు గురైనట్టు తెలిపింది. 2013 ఆగస్టులో జరిగిన ఈ దాడి చరిత్రలోనే అతిపెద్ద సైబర్ దాడిగా పేర్కొంది. ఈ నేపథ్యంలో తమ యూజర్లకు పలు సూచనలు చేస్తూ తమ పాస్‌వర్డ్‌లు, సెక్యూరిటీ ప్రశ్నల సమాధానాలు మార్చుకోవాలని యూహూ పేర్కొంది. దీంతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో పడిన యాహూ మరిన్ని కష్టాల్లో చిక్కుకుపో్యింది.