ఉన్నతమైన హోదాలో ఉండి... విధులు నిర్వహిస్తున్న అతడి ప్రవర్తన పక్కదారి పట్టింది. విచక్షణ మరిచి, ఆకతాయి వేషాలు వేసి అడ్డంగా దొరికిపోయి చివరకు చావు దెబ్బలు తిన్నాడు. విశాఖ పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురంలోని ఎక్స్ సర్వీస్‌మెన్ కాలనీలో ఓ యువతి స్నానం చేస్తుండగా నేవీ ఉద్యోగి తన సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. ఇది గమనించిన సదరు యువతి, కుటుంబ సభ్యులు అతన్ని రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకుని చితకబాదారు. బాధితురాలు ఆగ్రహంతో నిందితుడిని చెప్పుతో ఎడా పెడా వాయించేసింది. మహిళ ఫిర్యాదు మేరకు మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేసి, స్టేషన్‌కు తరలించారు. పోలీసుల విచారణలో నిందితుడు నేవీ ఉద్యోగి అని...నేవల్ డాక్‌యార్డ్‌లో పని చేస్తున్నట్లు తేలింది.
Jun 2 2017 4:23 PM | Updated on Mar 21 2024 7:44 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement