అన్నాహజారే ఇప్పుడు అంతా అయిపోయాక వస్తే ఏం లాభమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. ఏపీ రాజధానికి 33 వేల ఎకరాల భూములను ఇప్పటికే సమీకరించామని ఆయన చెప్పారు. రైతులందరూ భూములు ఇచ్చారని, వాళ్లంతా సంతోషంగా ఉన్నారని మంత్రి తెలిపారు. అన్నాహజారే, మేధాపాట్కర్ లాంటి వాళ్లు ఇప్పుడు పర్యటించినంత మాత్రాన ఏమీ కాదని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని నగరం రావడం ఇష్టంలేనివాళ్లే అన్నాహజారే, మేధాపాట్కర్లను రప్పిస్తున్నారని విమర్శించారు. సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజధానికి వ్యతిరేకం కాదని, భూసేకరణ చేస్తేనే వ్యతిరేకిస్తానని ఆయన చెప్పారని ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు.
Apr 23 2015 4:34 PM | Updated on Mar 22 2024 11:13 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement