విజయవాడ కేంద్రంగా రైల్వే జోన్ ఒప్పుకునే ప్రసక్తి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గుడివాడ అమర్ నాథ్ అన్నారు. విశాఖపట్నంలోనే రైల్వే జోన్ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. దీనికోసం తాను గతంలో ఐదు రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసినట్లు చెప్పారు. యోగా దినోత్సవం సందర్భంగా రైల్వే శాఖమంత్రి సురేశ్ ప్రభు కూడా విశాఖపట్నంలోనే రైల్వే జోన్ ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారని, పలు పత్రికల్లో కూడా ఈ విషయం వచ్చిందని అన్నారు. ఈ రోజు మాత్రం కేంద్రంలోని బీజేపీ నేతలు, టీడీపీ పార్లమెంటరీ సభ్యులు మాట్లాడే మాటలు చూస్తుంటే అనుమానించాల్సి వస్తుందని, ఎట్టి పరిస్థితుల్లో విశాఖలోనే రైల్వే జోన్ పెట్టాలని డిమాండ్ చేశారు.
Sep 7 2016 4:34 PM | Updated on Mar 21 2024 7:44 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement