వైస్ అవినాష్ రెడ్డి అరెస్ట్, రిమ్స్ కు తరలింపు | వైస్ అవినాష్ రెడ్డి అరెస్ట్, రిమ్స్ కు తరలింపు | Sakshi
Sakshi News home page

Aug 25 2013 7:21 PM | Updated on Mar 21 2024 5:15 PM

రాష్ట్రంలోని నీటి సమస్యలు, హైదరాబాద్ అంశం పరిష్కారమయ్యేంత వరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందే అంటూ చేపట్టిన పులివెందుల సమన్వయకర్త వైఎస్ అవినాష్ రెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అవినాష్ రెడ్డి శిబిరం వద్దకు భారీ ఎత్తున పోలీసులు చేరుకుని అరెస్ట్ చేశారు. సమన్యాయం జరిగేంత వరకు సమైక్యంగా ఉంచాలంటూ అవినాష్ రెడ్డి చేపట్టిన దీక్ష ఆదివారానికి ఏడో రోజుకు చేరుకుంది. అవినాష్ రెడ్డి ఆరోగ్యం క్షీణించి.. ఆందోళనకరంగా మారింది. వైద్యులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా.. అవినాష్ రెడ్డి దీక్షను కొనసాగించడానికే సిద్ధమయ్యారు. ఆదివారం సాయంత్రం 6 గంటల తర్వాత అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమ్స్ అస్పత్రికి తరలించారు. అయితే వైఎస్ అవినాష్ రెడ్డి ఆస్పత్రిలో కూడా దీక్షను కొనసాగిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement