: జిల్లాలోని కోస్గి మండలంలో రాజోలిబండ నీటి మళ్లింపు పథకం (ఆర్డీఎస్) వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆర్డీఎస్ ఆనకట్ట ఎత్తు పెంచేందుకు కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ఆనకట్ట ఎత్తు రెండు అడుగుల పెంచాలని కర్నాటక ప్రభుత్వం పనులు చేపట్టడంతో కర్నూలు జిల్లాకు చెందిన రైతులు ఆర్డీఎస్ వద్ద ఆందోళనకు దిగారు. కోస్గి దగ్గర రైతులు అధికారులను అడ్డుకున్నారు. తమకు 3 వేల టీఎంసీల నిలువ నీరు రావలసి ఉండగా ఇప్పటి వరకు రాలేదని రైతులు ధర్నా చేపట్టారు. భారీ సంఖ్యలో జిల్లా రైతులు ఇక్కడకు తరలి వచ్చారు. దాంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలిసిన వెంటనే వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి సంఘటనాస్థలికి చేరుకున్నారు. రైతులకు మద్దతుగా నిలిచారు.
Jul 6 2014 6:13 PM | Updated on Mar 21 2024 8:18 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement