పెట్టుబడుల సాధనలో రాష్ట్రం అనూహ్య ప్రగతిని సాధించింది. తోటి రాష్ట్రాలను అధిగమించడమేకాదు జాతీయ సగటును కూడా దాటేసింది. రాష్ట్రం గత ఐదేళ్లలో ఏకంగా మూడింతలకు పైగా పెట్టుబడుల వృద్ధి సాధించిందని ‘అసోసియేటెడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్)’ ప్రకటించింది.