జై ఆంధ్రప్రదేశ్ సభను అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎన్నో కుతంత్రాలు చేసిందని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. ఎన్ని ఆటంకాలు కల్పించినా సభను ప్రజలు విజయవంతం చేశారని చెప్పారు. సభను విజయవంతం చేసినందుకు ప్రజలకు వైఎస్సార్ సీపీ తరపున ధన్యవాదాలు తెలిపారు.