అది దక్షిణాఫ్రికాలోని ఓ సముద్రం. భారీగా ఎగిసి పడుతున్న అలలు. ఒడ్డున ఆనందంతో ఎగిరి గంతులేస్తున్న భారీ జనం.. చుట్టూ కెమెరాలు. సముద్రపు అలలపై సర్ఫర్లు(చిన్న తెప్పలాంటిదానిపై నిల్చునిగానీ, పడుకొని గానీ సముద్రపు అలలపై రైడింగ్ చేసేవాళ్లు). వేగంగా వారు దూసుకెళుతుండగా వారికి రక్షణగా మరపడవలు. ఇందులో మిక్ ఫ్యానింగ్ అనే ఆస్ట్రేలియా సర్ఫర్ వాయువేగంతో లక్షిత ప్రాంతానికి దూసుకొస్తున్నాడు.