తమిళనాడులో భారీ బందోబస్తు | sucurity Tightened in tamilnadu | Sakshi
Sakshi News home page

Dec 5 2016 10:55 AM | Updated on Mar 21 2024 6:42 PM

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులకు సెలవులు రద్దు చేస్తున్నట్టు తమిళనాడు డీజీపీ ప్రకటించారు. 11 కంపెనీల ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ను సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు, హైవేలపై భద్రతను కట్టుదిట్టం చేశారు. కేంద్ర ఇంటలిజెన్స్‌ వర్గాలు తమిళనాడు డీజీపీతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించాయి.

Advertisement
 
Advertisement
Advertisement