నరేంద్ర మోడీ చెప్పే చందమామ కథలు వినడానికి ఇక్కడి ప్రజలు అమాయకులు కాదని వైఎస్సార్ సీపీ నేత షర్మిల విమర్శించారు. అసలు మోడీకి కుటుంబ విలువలు ఉన్నాయో లేదో తనకు తెలియదని, ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి మాత్రం ఆ విలువలు బాగా తెలుసని షర్మిల తెలిపారు. జిల్లాలోని కొయ్యలగూడెం ఎన్నికల ప్రచార సభలో హాజరైన షర్మిలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన షర్మిల.. నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై విరుచుకుపడ్డారు. నరేంద్ర మోడీ ఏవో చందమామ కథలు చెబుతున్నాడని, వాటిని వినడానికి ఈ రాష్ట్ర ప్రజలు ఏమీ అమాయకులు కాదని షర్మిల విమర్శించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాలనలో 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెరిగిన సంగతిని గుర్తు చేశారు. ఢిల్లీ నుంచి ఊడిపడ్డ సీల్డ్ కవర్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచారన్నారు. కాంగ్రెస్ అన్యాయంగా పరిపాలిస్తుంటే అధికార పక్షాన్ని నిలదీయకుండా బాబు కూడా కుమ్మక్కయ్యారన్నారు.
May 2 2014 6:22 PM | Updated on Mar 22 2024 11:20 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement