కాంగ్రెస్ అధిష్టానం జులైలో తెలంగాణకు ఒక ప్యాకేజీ ఇవ్వాలని అనుకుందని, అయితే దానిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. గుంటూరులో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ ప్యాకేజీలో తెలంగాణ వారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్నది ముఖ్యమైన ప్రతిపాదన అని తెలిపారు. దాంతో ఆ ప్రతిపాదనను కిరణ్ తిరస్కరించారని చెప్పారు. ప్రజల జీవితాలతో ఎందుకు చెలగాటం ఆడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఆ ప్యాకేజీ మీరు తిరస్కరించలేదా? వాస్తవం చెప్పాలని కిరణ్ కుమార్ రెడ్డిని డిమాండ్ చేశారు. విభజన తుపాను సీఎం కిరణ్ అసమర్ధత వల్లే ప్రారంభమైందని అంబటి మండిపడ్డారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు రాష్ట్రాన్ని విభజించడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. సిడబ్ల్యూసి ప్రకటన వెలువడిన ముందు రోజు గానీ, ఆ రోజున గానీ సిఎం రాజీనామా చేసి ఉంటే సోనియా గాంధీ వెనక్కు తగ్గేదని అన్నారు. ఆయన రాజీనామా చేస్తే రాజకీయ సంక్షోభం ఏర్పడేదన్నారు. సిడబ్ల్యూసి ఆ సాహసం చేసి ఉండేదికాదని అంబటి చెప్పారు.
Oct 21 2013 5:02 PM | Updated on Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement