పఠాన్ కోట్, ఉడీ ఉగ్రదాడుల సూత్రధారి, జైష్ ఏ మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజాద్ సహా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోన్న 5100 మంది బ్యాంక్ అకౌంట్లను స్తంభింపజేస్తూ పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయా ఖాతాల గుండా ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున నిధులు సరఫరా అవుతున్నట్లు గుర్తించిన జాతీయ ఉగ్రవాద వ్యతిరేక సంస్థ(నాక్టా)..ఆ మేరకు వాటిని స్తంభింపజేయాలని ప్రభుత్వాన్ని కోరింది.