ఉద్యోగానికి వెళ్తున్నానంటూ గతరాత్రి అదృశ్యమైన భువనగిరి సబ్‌జైల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు బుధవారం ఖమ్మంలో ప్రత్యక్షమయ్యారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శ్రీనివాసరావు చికిత్స పొందుతున్నట్టు తెలిసింది. మూడు రోజుల క్రితం ఆయన్ని జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటకు బదిలీ చేశారు. దీనిపై శ్రీనివాస్ తీవ్ర మనస్తాపం చెందారు.