నాలుగు పదుల నవరస నటతిలకం | MP Subbarami Reddy Birthday Celebrations In Visakhapatna | Sakshi
Sakshi News home page

Sep 18 2016 12:35 PM | Updated on Mar 22 2024 11:19 AM

‘విలన్ వేషం వేయగలిగినవాడు ఆల్‌రౌండర్. హిందీలో వినోద్ ఖన్నా, శత్రుఘ్నసిన్హా, తమిళంలో రజనీకాంత్, తెలుగులో చిరంజీవి, మోహన్‌బాబు - ఇలా ఎక్కువకాలం నిలబడిన ఆర్టిస్టులందరూ విలన్ పాత్రలతో ఇండస్ట్రీకి వచ్చినవారే. చరిత్రలో మిగిలిపోయే ఎన్నో సినిమాలు మోహన్‌బాబు చేశాడు. ఒక్కసారి పరిచయమైతే అతనితో స్నేహాన్ని విడిచిపెట్టరు’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. రాజ్యసభ సభ్యుడు, ‘కళాబంధు’ టి. సుబ్బరామిరెడ్డి (టీయస్సార్) తన పుట్టినరోజు సందర్భంగా, నటుడిగా నలభై వసంతాలు పూర్తి చేసుకున్న మోహన్‌బాబును శనివారం వైజాగ్‌లో ఘనంగా సన్మానించారు. ప్రముఖ సినీ హీరోలు, హీరోయిన్లు, రాజకీయ, సాంస్కృతిక ప్రముఖులెందరో హాజరైన ఈ వేడుకలో మోహన్‌బాబుకు ‘నవరస నట తిలకం’ అనే బిరుదునిచ్చి, స్వర్ణకంకణం తొడిగారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement