కరీంనగర్ జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న మిడ్ మానేరు ప్రాజెక్ట్ కట్టకు గండిపడింది. ఎగువ మానేరు నుంచి భారీగా వస్తున్న వరదతో మిడ్ మానేరు మట్టికట్ట కొట్టుకుపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులను దిగువ ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. భారీ వర్షాలతో పొటెత్తిన వరదల కారణంగా భారీ మొత్తంలో ప్రవాహం వచ్చి డ్యాంలో చేరడంతో అనూహ్యంగా డ్యాం మట్టికట్టకు గండి పడింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తమయ్యారు.