గ్యాంగ్స్టర్ నయీం కేసును సీబీఐకి అప్పగించాలని మాజీమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. నయీంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సొంత పత్రికలో తమపై తప్పుడు వార్తలు రాయిస్తున్నారని కోమటిరెడ్డి శుక్రవారమిక్కడ ఆరోపించారు. తాము తప్పు చేసినట్లు అయితే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని ఆయన అన్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి ముఖ్యమంత్రి తప్పుదోవ పట్టిస్తున్నారని కోమటిరెడ్డి అన్నారు. నిజాయితీగా పనిచేస్తున్న శివధర్ రెడ్డిని ఈ కేసు దర్యాప్తు నుంచి తప్పించారన్నారు.