సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణకు మాతృవియోగం కలిగింది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జస్టిస్ రమణ తల్లి నూతలపాటి సరోజినీదేవి (85) బుధవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సాయంత్రం ఆమె పార్థివ దేహాన్ని ఎస్‌ఆర్ నగర్‌లోని స్వగృహానికి తీసుకువచ్చారు. సరోజినీదేవి మరణ వార్త తెలిసిన వెంటనే పలువురు న్యాయమూర్తులు, న్యాయాధికారులు, హైకోర్టు సిబ్బంది జస్టిస్ రమణ నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు.