రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పే మాటలన్నీ అబద్ధాలేనని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సభలో తాను మాట్లాడకూడదనే అసెంబ్లీని రేపటికి వాయిదా వేశారని ఆయన మీడియా చిట్‌చాట్‌లో అన్నారు. 80 శాతం ప్రాజెక్టుల పనులు చంద్రబాబు రాకముందే పూర్తయ్యాయని, మిగతా 20శాతం పనులను కూడా చంద్రబాబు పూర్తి చేయలేదన్నారు. గండికోట, చిత్రావతి, పోతిరెడ్డిపాడు సహా ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు. మూడేళ్లయినా చంద్రబాబుకు ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న ధ్యాసే లేదన్నారు.