విరించి, విహారి మృతదేహాల వెలికితీత | icfai-university-professor-sons-bodies-exhumed | Sakshi
Sakshi News home page

Oct 6 2014 7:03 PM | Updated on Mar 22 2024 11:12 AM

తండ్రి చేతిలో దారుణహత్యకు గురైన విఠల్ విరించి (9), నంద విహారి (5) మృతదేహాలను వెలికితీశారు. మేడ్చల్ లోని బీరంగూడలో పూడ్చిపెట్టిన చిన్నారుల మృతదేహాలను సోమవారం సాయంత్రం బయటకు తీశారు. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఆత్మహత్య చేసుకున్న ఇక్ఫాయ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాఘవేంద్ర గురుప్రసాద్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకునే ముందు తన ఇద్దరు పిల్లలను అతడు హత్యచేశాడు. పిల్లల మృతదేహాలను మేడ్చల్ లో ఉంచానని తన భార్య ఫోన్ కు గురుప్రసాద్ మెసేజ్ పంపించాడు. దీని ఆధారంగా చిన్నారుల మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. సొంత స్థలంలోనే గురుప్రసాద్ తన కుమారుల మృతదేహాలను పాతిపెట్టాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement