హిమాచల్ ప్రసాద్ బియాస్ నదిలో సోమవారం మరో విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మృతుడు నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన మేడం విష్ణువర్థన్ రెడ్డిగా గుర్తించారు. అతని మృతదేహాన్ని హైదరాబాద్ తరలించనున్నారు. ఇప్పటివరకూ బియాస్ నదిలో 20 మృతదేహాలు లభ్యం అయ్యాయి. ఇంకా గల్లంతు అయిన నలుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని జలాశయం నిర్వాహకులు, కళాశాల యాజమాన్యం చెరి సగం చెరి సగం చొప్పున చెల్లించాలని న్యాయస్థానం పేర్కొంది. జూన్ 8వ విహారయాత్రకు వెళ్లిన హైదరాబాద్‌లోని విజ్ఞానజ్యోతి కళాశాలకు చెందిన 24 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు బియాస్ నదిలో లార్జి డ్యాం నుంచి ఆకస్మికంగా నీరు వదలడంతో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే.
Jun 30 2014 3:40 PM | Updated on Mar 21 2024 6:35 PM
Advertisement
Advertisement
Advertisement
