ఆదిలాబాద్ జిల్లా ముధోల్ మండలంలో దారుణం జరిగింది. కన్న తండ్రే కూతురు పాలిట కాలయముడయ్యాడు. మళ్లీ ఆడపిల్ల పుట్టిందని కసాయి తండ్రి 9 నెలల పాపను కడతేర్చాడు. ముధోల్ మండలం వడ్తాల గ్రామానికి చెందిన లక్ష్మణ్‌కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య ముత్తుకు ఐదుగురు ఆడపిల్లలు. దీంతో సంవత్సరం క్రితం భైంసా పట్ణణానికి చెందిన లక్ష్మిని రెండో వివాహం చేసుకున్నాడు.