అనంత టీడీపీలో ‘డెంగీ’ వార్‌ !! | Sakshi
Sakshi News home page

అనంత టీడీపీలో ‘డెంగీ’ వార్‌ !!

Published Mon, Sep 19 2016 9:31 AM

తెలుగుదేశం పార్టీలో ‘డెంగీ’వార్‌ మొదలైంది. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి మధ్య కొంతకాలంగా నడుస్తున్న విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ‘అనంత’లోని పాతూరులో డెంగీతో చిన్నారులు చనిపోయిన అంశాన్ని అస్త్రంగా చేసుకుని ఇద్దరూ పరస్పర ఆరోపణలకు దిగారు. ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్‌పై జేసీ దివాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలకు దిగారు. జేసీ వ్యాఖ్యానించిన కొద్ది గంటలకే ఎమ్మెల్యే చౌదరి కూడా ఘాటుగానే స్పందించారు. అయితే ప్రస్తుతం నగరంలో ఉన్న పరిస్థితిలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు రాజకీయలబ్ధి కోసం వ్యక్తిగత దూషణలకు దిగడం దారుణమని జనం మండిపడుతున్నారు.

Advertisement