టీడీపీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డికి ఎట్టకేలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కేసులో ఆయన ఎన్నిక సక్రమమేనని న్యాయస్థానం తీర్పునిచ్చింది. కోర్టులోనే న్యాయమూర్తులు లాటరీ తీయటంతో నర్సారెడ్డి గెలుపొందగా, వెంకటరామిరెడ్డి ఓడిపోయారు.