బ్యాంకులపై కేంద్రం కీలక నిర్ణయం! | centre decision on banks working | Sakshi
Sakshi News home page

Nov 9 2016 6:11 PM | Updated on Mar 20 2024 5:04 PM

పెద్దనోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే శనివారం, ఆదివారం కూడా దేశంలోని అన్నీ బ్యాంకులు పనిచేస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. పెద్దనోట్లను రద్దుచేయడం, ఆ వెంటనే బుధవారం బ్యాంకులు పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. రూ. 500, రూ. వెయ్యినోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. పెద్దనోట్లు చెలామణి కాకపోవడంతో చాలాచోట్ల టోల్‌గేట్ల వద్ద వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులను దూరం చేయడానికి టోల్‌ట్యాక్స్‌లను కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement