హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో కుప్పకూలిన భవనం శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. కొద్ది సేపటి క్రితమే మరో మృతదేహాన్ని వెలికితీశారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య రెండుకు చేరింది. మరో పది మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు సమాచారం. వారిని శిథిలాల నుంచి బయటకు తీసేందుకు రెస్క్యూ టీమ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఇరుక్కున్న ఛత్తీస్‌గడ్‌కు చెందిన ఓ మహిళ, చిన్నారిని రెస్క్యూ టీమ్ సురక్షితంగా రక్షించగలిగింది.