తాట తీసి ఉతికి ఆరేసింది.... | bangalore-woman-chases-eve-teaser-kicks-him | Sakshi
Sakshi News home page

Aug 12 2014 5:43 PM | Updated on Mar 21 2024 11:25 AM

తన వెంట పడుతున్న పోకిరికి మర్చిపోలేని గుణపాఠం నేర్పింది బెంగళూరు యువతి. తను అల్లరి చేయాలని చూసిన ఆకతాయి తాటతీసి.. గట్టిగా బుద్ధి చెప్పింది. వేధింపులకు గురి చేస్తూ, అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఆకతాయికి ధైర్యంగా ఎదుర్కొంది. అంతేకాదు తనపట్ల అసభ్యంగా వ్యవహరించి పారిపోతున్న అతన్ని ఆమె వెంటాడి పట్టుకోవడమే కాకుండా.. మరీ చితక్కొట్టింది. మళ్లీ తన జోలికి వస్తే ఖబద్దార్ అంటూ కాళిక అవతారం ఎత్తింది. ఈ తతంగాన్ని ఆమె స్నేహితురాలు వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఆ వీడియో ఫేస్ బుక్లో హల్ చల్ చేస్తోంది. తనలాగే ఎదురు తిరిగితే పోకిరిలు తోక ముడుస్తారంటూ తోటి స్త్రీలకు ఈ వీడియో ద్వారా సందేశం ఇచ్చింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement