చుక్కలు చూపిన ఏటీఎంలు | ATM is shown hell | Sakshi
Sakshi News home page

Nov 12 2016 8:59 AM | Updated on Mar 22 2024 11:05 AM

‘ఔట్ ఆఫ్ సర్వీస్..’ ‘ఔట్ ఆఫ్ ఆర్డర్..’ ‘నో క్యాష్..’ ‘క్లోజ్డ్..’ రాష్ట్రంలో శుక్రవారం ఎక్కడ చూసినా ఏటీఎం కేంద్రాల వద్ద కనిపించిన బోర్డులివి! ఏటీఎంలు పనిచేయకపోవడంతో జనం నరకం చూశారు. అటు బ్యాంకులకు వెళ్తే బారులు.. ఇటు ఏటీఎంలకు వెళ్తే ‘నో క్యాష్’ బోర్డు లు చూసి తలలు పట్టుకున్నారు. వరుసగా మూడోరోజూ ‘నోటు’ కోసం అల్లాడారు. చిల్లర తిప్పలూ తప్పలేదు. హైదరాబాద్ తోపాటు కొన్ని పట్టణాల్లో అరకొరగా పని చేసిన ఏటీఎం కేంద్రాల్లో కేవలం రూ.100 నోట్లు మాత్రమే అందారుు. రూ.2 వేల నోటు జాడే కనిపించలేదు. జనం పోటెత్తడంతో అటు బ్యాంకులు కూడా చేతులెత్తేశారుు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement