పౌర్ణమి పర్వదినం సందర్భంగా తిరుమలలో ఆదివారం రాత్రి గరుడ వాహన ఊరేగింపు వైభవంగా సాగింది. పౌర్ణమి సందర్భంగా ఆలయ పురవీధుల్లో మలయప్ప గరుడ వాహనంపై దర్శనమివ్వటం సంప్రదాయం. సాయం సంధ్యా సమయం పూజలు ముగించుకుని శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప కొలువు మండపంలో వేంచేపు చేశారు