చంద్రబాబే అధికారులతో మాట్లాడిస్తున్నారు | Ambati Rambabu takes on Chandrababu | Sakshi
Sakshi News home page

Mar 2 2017 4:50 PM | Updated on Mar 20 2024 1:43 PM

దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యాన్ని రక్షించేందుకే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తప్పుడు కేసు పెట్టారని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదం విషయంలో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రమాదంలో మరణించిన డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా తరలించేందుకు ప్రయత్నించారని, వైఎస్ జగన్ ఈ విషయం గురించి డాక్టర్, కలెక్టర్‌ను అడిగారని చెప్పారు. పోస్టుమార్టం చేయకపోవడం చట్టవిరుద్ధమని, పోస్టుమార్టం చేయకుండా మృతదేహాన్ని పంపిస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని వైఎస్ జగన్ అన్నారని, చట్టం గురించి మాట్లాడటం తప్పా అని అంబటి ప్రశ్నించారు. వైఎస్ జగన్ ప్రశ్నించాకే డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement