మహిళలపై ఇంజక్షన్ దాడులకు పాల్పడుతున్న సైకో సమాచారం అందించిన వారికి రూ.50 వేల బహుమతి అందిస్తామని పశ్చిమ గోదావరి ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 40 ప్రత్యేక బృందాలు, 15 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. మహిళలపై ఇంజక్షన్ దాడులను సీరియస్గా తీసుకున్నామన్నారు.