ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలపై వరంగల్ జిల్లా జనగాం డీఎస్పీ సురేందర్ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. జిల్లాలోని జనగాం, హన్మకొండతోపాటు హైదరాబాద్‌లోని ఆయన ఇళ్లపై దాడులు చేశారు. జనగాంలోని డీఎస్పీ కార్యాలయంలోనూ సోదాలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.