ఆంధ్రప్రదేశ్ కొత్త అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగానికి ఆటంకాలు తప్పలేదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో రెండోరోజు నీటిపారుదల రంగంపై అడిగిన ప్రశ్నకు మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఇచ్చిన సమాధానంపై వివరణ ఇచ్చేందుకు విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేచి మాట్లాడుతుండగా మధ్యలోనే ఆపి, మరో ప్రశ్నకు వెళ్లిపోయారు. పులివెందులకు నీళ్లిచ్చామని మంత్రి పదే పదే చెబుతున్నారని, దీనిపైనే మాట్లాడతానని అన్నారు.