తలరాత బాగుంటే ఎలాంటి ప్రమాదం జరిగిన బతుకుతారు.. అదే తలరాత బాగలేకుంటే ఏ ప్రమాదం లేకుండానే చనిపోతారు. ఇది సాధారణంగా అందరు అనుకుంటూ ఉండే మాట. అయితే, బహుషా ఇలాంటి మాటలు ఒక్కోసారి నిజమే అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇన్నోవా కారు మీద నుంచి పోయిన ఓ మూడేళ్లపాప ప్రాణాలతో బయటపడింది. నాసిక్లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీ రోడ్డుపక్కన అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.