ప్యాంటు జేబులో పెట్టుకున్న చైనా సెల్‌ఫోన్ కాలిపోవడంతో ఓ యువకుడు గాయపడిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో చోటుచేసుకుంది. రావులపాలెం గ్రామానికి చెందిన భావన సూర్యకిరణ్ కిళ్ళీ కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం ఉదయం అతను సెల్‌ఫోన్ ప్యాంట్ జేబులో పెట్టుకుని మోటార్ సైకిల్పై దుకాణానికి వెళ్తుండగా.. అది ఒక్కసారిగా కాలిపోయి జేబులో నుంచి మంటలు వచ్చాయి. దీంతో బండి దిగి ఎంత లాగినా ఫోన్ బయటకు రాలేదు. మంటలు గమనించిన స్థానికులు వెంటనే నీళ్లు చల్లి మంటలు ఆర్పి ఫోన్‌ను కింద పడేశారు. ఈ సంఘటనలో కిరణ్ తొడ భాగంలో గాయాలయ్యాయి. ఇరవై రోజుల క్రితమే కొనుగోలు చేసిన రెడ్-ఎంఐ నోట్-4 ఫోన్ ఇలా కాలిపోయిందని కిరణ్ తెలిపారు. కొత్త నోట్-4 ఫోన్ కాలిపోవడమే కాకుండా ఆ మంటల వల్ల తనకు గాయాలయ్యాయని, దీనిపై కోర్టును ఆశ్రయిస్తానని ఆయన చెప్పారు.
కాలిపోయిన 'నోట్-4'.. యువకుడికి గాయాలు!
Aug 13 2017 3:30 PM | Updated on Mar 22 2024 11:03 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement