‘బాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్ల ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

‘బాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్ల ఆవిష్కరణ

Jun 3 2026 1:39 AM | Updated on Jun 3 2026 1:39 AM

‘సర్‌’అమలును జాగ్రత్తగా పరిశీలించాలి

కడప కార్పొరేషన్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్లను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ఆవిష్కరించారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్లమెంటు పరిశీలకులు కొండూరు అజయ్‌రెడ్డి, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ దాసరి సుధ, మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, పార్టీ సీఈసీ సభ్యులు కె. సురేష్‌ బాబు, అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, జెడ్పీ ఛైర్మెన్‌ రామగోవిందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ సక్రమంగా అమలు చేయలేదన్నారు. ‘బాబూ ష్యూరిటీ, మోసం గ్యారెంటీ’ అనే నినాదాన్ని నిజం చేసి, ఆరు కోట్ల మంది ప్రజలను మోసం చేశారని విమర్శించారు అధికారంలోకి వచ్చాక 18 ఏళ్లు నిండిన మహిళలకు ఇస్తామన్న ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయకుండా ప్రతి మహిళకు రూ.36వేలు, నిరుద్యోగులకు 20లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఒక్కో నిరుద్యోగికి రూ.72వేలు, 50 ఏళ్లకే పింఛన్‌ ఇవ్వకుండా ఒక్కొక్కరికి రూ.96వేలు, అన్నదాత సుఖీభవ ద్వారా ఒక్కో రైతుకు రూ.26వేలు బకాయి పడ్డారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 6.23లక్షల పింఛన్లు కోత కోశారని, ప్రతినెలా 25వేల పింఛన్లు తీసేస్తున్నారని ధ్వజమెత్తారు. ఉచిత బస్సు అని కేవలం ఐదు సర్వీసుల్లోనే అమలు చేస్తున్నారని, మొత్తం ఆర్టీసీనే ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. మెగా డీఎస్సీ పేరుతో దగా చేశారన్నారు. ఈ ప్రభు త్వం రెండేళ్లలో ప్రజలకు చేసిన మోసాలపై ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో ఈనెల 4వ తేది మండల కేంద్రాల కూడళ్లలో టీడీపీ మేనిఫెస్టో కాపీలను, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ సంతకాలతో కూడిన బాండ్లను దహనం చేస్తామన్నారు. 8,9 తేదీలలో నియోజకవర్గ కేంద్రాల్లో సదస్సులు నిర్వహిస్తామని, 12న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి అధికారులకు వినతి పత్రాలు అందిస్తామని వివరించారు. ఈ కార్యక్రమాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఈసీ సభ్యులు యానాదయ్య, డాక్టర్‌ సొహైల్‌, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కడప నియోజకవర్గ పరిశీలకులు గురుమోహన్‌, ఎస్సీసెల్‌ స్టేట్‌వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పులి సునీల్‌కుమార్‌, సగర విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బంగారు శీనయ్య, నూర్‌బాష్‌, దూదేకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఓ. రసూల్‌, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి శివప్రసాద్‌, బంగారు నాగయ్య పాల్గొన్నారు.

కడప కార్పొరేషన్‌: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌) కార్యక్రమ అమలును వైఎస్సార్‌సీపీ బూత్‌ లెవెల్‌ ఏజెంట్లు జాగ్రత్తగా పరిశీలించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో పార్లమెంటు పరిశీలకులు కొండూరు అజయ్‌రెడ్డి, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ దాసరి సుధ, మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, పార్టీ సీఈసీ సభ్యులు కె. సురేష్‌ బాబు, అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, జెడ్పీ ఛైర్మెన్‌ రామగోవిందరెడ్డిలతో కలిసి కోర్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీకి చెందిన బూత్‌ లెవెల్‌ ఏజెంట్లు ఇంటింటికీ వెళ్లి ఆ ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎవరైనా చనిపోయారా, వలస పోయారా, ఉద్యోగాల నిమిత్తం ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్నారా అనే వివరాలను సేకరించాలన్నారు. ఆ వివరాలు తెలిసి ఉంటే బీఎల్‌ఓలు ఏ ఓట్లు తొలగిస్తున్నారో తెలిసిపోతుందన్నారు. పార్టీ ఇచ్చిన వర్క్‌షీట్‌ను భర్తీ చేసి జిల్లా కార్యాలయానికి పంపాలన్నారు.

అదనపు ఎస్పీని కలిసిన

వైఎస్సార్‌సీపీ నేతలు

కోర్‌ కమిటీ సమావేశం అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ పి. రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తదితరులు జిల్లా అదనపు ఎస్పీ ప్రకాష్‌ బాబును కలిశారు. ఈ సందర్బంగా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 4, 8,9,12 తేదీలలో నిర్వహించే నిరసన కార్యక్రమాలను తెలియజేశారు. శాంతియుతంగా నిర్వహించే ఈ కార్యక్రమాలను అనుమతి మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, ఫయాజ్‌, నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈనెల 4న మండల కేంద్రాల్లో టీడీపీ మేనిఫెస్టో కాపీలు దహనం

12న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడుపి. రవీంద్రనాథ్‌రెడ్డి వెల్లడి

Advertisement
 
Advertisement
Advertisement