301 మంది గైర్హాజరు | - | Sakshi
Sakshi News home page

301 మంది గైర్హాజరు

Jun 3 2026 1:39 AM | Updated on Jun 3 2026 1:39 AM

301 మంది గైర్హాజరు జేఈఈ అడ్వాన్స్‌ ఫలితాల్లో వేంపల్లెవాసి సత్తా హాకీ ట్రైనింగ్‌ సెంటర్‌కు చరిత ఎంపిక రిమ్స్‌ పీజీ విద్యార్థినికి గోల్డ్‌మెడల్‌ ఆర్‌కే వ్యాలీ ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌గా విజయ్‌ ప్రకాష్‌

కడప ఎడ్యుకేషన్‌: జిల్లాలో జరుగుతున్న పదో తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన సోషియల్‌ పరీక్షలకు 301 మంది గైర్హాజరయారు. జిల్లావ్యాప్తంగా 22 పరీక్షా కేంద్రాలలో 1623 మందికిగాను 1322 మంది హాజరయ్యారు. అలాగే ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్‌కు సంబంధించి రసాయన, ఆర్థికశాస్త్ర పరీక్షలకు సంబంధించి 656 మందికిగాను 586 మంది హాజరయ్యారు.

వేంపల్లె: జేఈఈ అడ్వాన్స్‌ ఫలితాల్లో వేంపల్లె మండలం బక్కన్నగారిపల్లె గ్రామానికి చెందిన ధార్మిక వెంకట్‌ ఆలిండియా 27వ ర్యాంక్‌ సాధించాడు. ఈ సందర్భంగా వెంకట్‌ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరుస్తూ క్రమశిక్షణతో కూడిన విద్యనభ్యసించానని తెలిపారు. కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు అతడిని అభినందించారు.

పులివెందుల: పట్టణంలోని వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో మూడేళ్లుగా సాధన చేస్తున్న చరిత స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా హాకీ ట్రైనింగ్‌ సెంటర్‌కు ఎంపికయ్యారు. గత ఏప్రిల్‌లో కర్ణాటకలోని మడికేరిలో జరిగిన రాష్ట్ర అకాడమీ ఎంపికల్లో రాణించి హాకీ ట్రైనింగ్‌ సెంటర్‌కు ఎంపికయ్యారు. ఈ నెల 8న చరిత అకాడమీలో చేరతారని ఖేలో ఇండియా హాకీ కోచ్‌ గౌస్‌ బాషా తెలిపారు. అకాడమీ సెలెక్షన్‌కు ఎంపికై న చరితకు డీఎస్‌డీఓ గౌస్‌ బాషా, వైఎస్సార్‌ ఇండోర్‌ స్టేడియం ఇన్‌ఛార్జి యేసుదాసు, ఖేలో ఇండియా డిప్యూటీ డైరెక్టర్‌ హిమబిందు అభినందనలు తెలిపారు.

కడప అర్బన్‌: రిమ్స్‌ మెడికల్‌ కళాశాల పీజీ విద్యార్థిని విరాజిత గోల్డ్‌మెడల్‌ సాధించారు. ఎన్టీయార్‌ హెల్త్‌ యూనివర్శిటీ పరిధిలో జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో ఆమె టాపర్‌గా నిలిచారు. ఈ మేరకు మంగళవారం ఎన్టీయార్‌ హెల్త్‌ యూనివర్శిటీ వీసీ డాక్టర్‌ చంద్రశేఖర్‌ చేతుల మీదుగా గోల్డ్‌మెడల్‌ ఎండీ(జనరల్‌ మెడిసన్‌) పట్టా అందుకున్నారు. డాక్టర్‌ విరాజిత తల్లిదండ్రులు రాఘవరెడ్డి, సర్వరాజ్యలక్ష్మి ఇరువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు. పీజీ కడప రిమ్స్‌ మెడికల్‌ కళాశాలల్లో జనరల్‌ మెడిసన్‌ విభాగంలో చేసి గోల్డ్‌మెడల్‌ సాధించడం విశేషం. తన విజయానికి సహకరించిన రిమ్స్‌ జన రల్‌ మెడిసిన్‌ విభాగ హెచ్‌ఓడీ డాక్టర్‌ యాదవేంద్రారెడ్డి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

వేంపల్లె: ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ నూతన డైరెక్టర్‌గా ప్రొఫెసర్‌ విజయ్‌ ప్రకాష్‌ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కుమార స్వామి గుప్తా బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో ఐఐటీ ఢిల్లీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న జి.విజయ్‌ ప్రకాష్‌ను నియమించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ట్రిపుల్‌ ఐటీలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న విభాగాధిపతులతో సమావేశమయ్యారు. ఆర్కే వ్యాలీ క్యాంపస్‌ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అందరి సహకారం అవసరమన్నారు. పరిపాలన అధికారి రవికుమార్‌, కొండారెడ్డి, రత్నకుమారి, అసోసియేట్‌ డీన్స్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement