● ఐపీఎల్ క్రికెట్ ఆధారంగా కోట్లు గడించిన తెలుగుతమ్ముళ్లు
● బెట్టింగ్ వ్యవహారాలల్లో టీడీపీ ఎమ్మెల్యేల అనుచరులు హల్‌చల్
● కడప పోలీసులకు పట్టుబడిన వాసు, పుత్తా వర్గీయులు
● ఎమ్మెల్యే వరద అండతో పరారీలో ప్రధాన బుకీ ఇలియాస్
కడప (సాక్షి ప్రతినిధి): జిల్లాలో టీడీపీ అండదండలతో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగింది. అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతల ఆశీస్సులే ఏకై క పెట్టుబడిగా ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు కోట్లాది రూపాయలు ఆర్జించారు. క్రికెట్ బెట్టింగ్ వ్యసనానికి బానిసగా మారినవారిని రోడ్డున పడేశారు.
పుత్తా, వాసు వర్గీయులు బుక్!
తాజాగా కడప నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ.. కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి, టీడీపీ జోనల్ అధ్యక్షుడు రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి (వాసు) ప్రధాన అనుచరులు కడప పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను ఆసరాగా చేసుకుని భారీ ఎత్తున బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీనిపై కడప నగరంలోని అక్కాయపల్లె ప్రాంతంలో పోలీసులు జరిపిన ఆకస్మిక దాడుల్లో ఇందిరెడ్డి జనార్ధన్‌రెడ్డి, మోడమీదపల్లెకు చెందిన మాధవరెడ్డి, చెన్నూరుకు చెందిన గుగ్గిళ్ల చాణక్య, రెడ్డెయ్యరెడ్డి, హరినాథ్, జయప్రకాష్ అనే వ్యక్తులు పట్టుబడ్డారు. వీరంతా తెలుగుదేశం పార్టీలో చురుగ్గా ఉంటూ.. ఎమ్మెల్యే కృష్ణచైతన్యరెడ్డికి వెన్నంటే నడిచే యూత్ వింగ్ నేతలు. వీరిలో మాధవరెడ్డిని ఇటీవలే టీడీపీ జోనల్ అధ్యక్షుడు వాసు స్వయంగా పార్టీలోకి ఆహ్వానించడం గమనార్హం.
ప్రొద్దుటూరులోనే ప్రధాన మూలాలు
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మారడంతో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మట్కా, గుట్కా, ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యక్రమాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల అండ వల్లే ఈ దందాలు సాగాయని, తాము అధికారంలోకి వస్తే వీటన్నింటినీ రూపుమాపుతామని స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఎన్నికల ప్రచారంలో ఊరువాడా ఉపన్యాసాలతో ఊదరగొట్టారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మారకపోగా, మరింత ఘోరంగా తయారైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్రికెట్ బెట్టింగ్, జూద నిర్వహణను అడ్డుకోవడంలో విఫలమైన అధికార పార్టీ నేతలు.. ఒకడుగు ముందుకు వేసి ప్రధాన బుకీలకు పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి ‘లైసెన్స్’ ఇచ్చారు. ఎక్కడ క్రికెట్ బెట్టింగ్ నెట్‌వర్క్ పట్టుబడినా, దాని మూలాలు ప్రొద్దుటూరు బుకీల వద్దకే చేరుతుండటం గమనార్హంలేపాక్షి కేసులో వెలుగుచూసిన లింకులు
ఇటీవల ఉమ్మడి అనంతపురం జిల్లాలోని లేపాక్షి పరిధిలో పోలీసులు ఒక క్రికెట్ బుకీని పట్టుకుని విచారించగా ఈ భారీ నెట్‌వర్క్ గుట్టురట్టయింది. సదరు నిందితుడు తాను ప్రొద్దుటూరు మండలంలోని దొరసానిపల్లె ప్రాంతానికి చెందిన బుకీ ద్వారా పనిచేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. అంతేకాకుండా, తాము వసూలు చేసిన క్రికెట్ పట్టీలను ప్రొద్దుటూరుకు చెందిన ప్రధాన బుకీ ఇలియాస్‌కు అందిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు.
ఎమ్మెల్యే అండతో ప్రధాన బుకీ పరారీ..
C…™èl ò³§ýlª G™èl$¢¯]l B«§éÆ>Ë$ ÌSÀ…-_-¯]l-ç³µ-sìæMîS, {糫§é¯]l º$MîS CÍ-Ķæ*‹Ü Cç³µ-sìæMîS ç³Æ>-È-ÌZ¯ól E¯é²yýl$. Ý린MýS GÐðl$ÃÌôæÅ Ð]lÆý‡-§ýl-Æ>-kÌS Æð‡yìlz Æ>f-MîSĶæ$ A…yýl-§ýl…-yýlË$ E…yýlr… Ð]lÌôæÏ CÍ-Ķæ*‹Ü ´ùÎ-çÜ$-ÌSMýS$ _MýSP-MýS$…yé ™èlí³µ…^èl$-MýS$¯é²-yýl¯ól BÆø-ç³-׿Ë$ ºÌS…V> Ѱ-í³-çÜ$¢-¯é²Æ‡$$. MîSÌSMýS çÜ*{™èl-«§é-Æý‡$OÌñæ¯]l Mö…§ýlÆý‡$ º$MîSË$ A«¨-M>Æý‡ sîæyîlï³ VýS*sìæMìS ^ólÇ-´ùÐ]l-yýl…™ø, ÐéÇOò³ MýS¯ðl²†¢ ^èl*õÜ ÝëçßæçÜ… MýS*yé Ý린MýS ´ùÎ-çÜ$Ë$ ^ólĶæ$-Ìôæ-MýS-´ù-™èl$-¯é²-Æý‡¯ól BÆø-ç³-׿Ë$ ºÌS…V> Ѱ-í³-çÜ$¢-¯é²Æ‡$$. hÌêÏ ÐéÅç³¢…V> GMýSP-yðl-MýSPyýl »ñæsìæt…VŠæ MóS…{§éË$ E¯é²Æ‡$$, GÐ]l-Æð‡-Ð]lÆý‡$ °Æý‡Ó-íßæ-çÜ$¢¯é²Æý‡$ A¯ól ÑçÙĶæ*-ÌSOò³ °çœ* Ð]lÆ>YÌSMýS$, ´ùÎçÜ$ Ð]lÅÐ]l-çܦMýS$ ç³NÇ¢ çÜÐ]l*-^éÆý‡… E¯]l²-ç³µ-sìæMîS.. ÐéÆý‡$ °Ð]l$ÃMýS$ ±Æð‡-†¢-¯]lr$Ï Ð]lÅÐ]l-çßæ-Ç-çÜ$¢-¯é²-Æý‡¯ól BÆø-ç³×æË$-¯é²Æ‡$$. A«¨-M>Æý‡ 糄ýS… ¯]l$…_ Ð]lçÜ$¢¯]l² ¡{Ð]lOÐðl$¯]l Æ>f-MîSĶæ$ J†¢yìl M>Æý‡-׿…-V>¯ól ´ùÎ-çÜ$Ë$ ^èlsêt°² çÜ{MýS-Ð]l$…V> लाAÐ]l$Ë$ ^ólĶæ$Ìôæ MýS$¯é²Æý‡° {ç³fË$ B{VýSçßæ… Ð]lÅMýS¢… ^ólçÜ$¢¯é²Æý‡$.
ఎన్నికల కోసమే బెట్టింగ్ దందా?
పోలీసులకు చిక్కిన వారంతా టీడీపీకి చెందిన కేవలం సాధారణ కార్యకర్తలు కారని, రాబో యే స్థానిక సంస్థల ఎన్నికల్లో వివిధ ప్రాంతాల నుంచి ప్రజాప్రతినిధులుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న తృతీయ శ్రేణి నాయకులని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టేందుకే, ఐపీఎల్ బెట్టింగ్ ద్వారా ఈజీ మనీ వైపు మొగ్గు చూపి కోట్లాది రూపాయలు ఆర్జించారని పరిశీలకులు భావిస్తున్నారు. కడప, ప్రొద్దుటూరు పరిధిలోనే కాకుండా పులివెందుల, జమ్మలమడుగు ప్రాంతాల్లో కూడా ఇలాంటి టీడీపీ నేతల అక్రమ దందాలు సాగుతున్నాయని సమాచారం.


