● డీఎస్సీ అక్రమాలపై నిజాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేసిన యువత
● డీఎస్సీని రద్దు చేసి
మరోసారి నిర్వహించాలి
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
పి.రవీంద్రనాథ్‌రెడ్డి డిమాండ్
● వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన విభాగంఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
కడప కార్పొరేషన్: డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆ పార్టీ జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య ఆధ్వర్యంలో మెగా కాదు...దగా డీఎస్సీపేరుతో భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రవీంద్రనాథ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ డీఎస్సీలో అనేక అక్రమాలు జరిగాయని, డీఎస్సీ రాసి న అభ్యర్థులతోపాటు అన్ని రాజకీయ పార్టీలు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం వీసమెత్తు కూడా స్పందించడం లేదని మండిపడ్డారు. పేపర్ లీక్ చేసి నిరుద్యోగ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. హారిజాంటల్ రిజర్వేషన్ అనేది పూర్తిగా తప్పుడు విధానమన్నారు. డీఎస్సీపై 33వేల మంది ఫిర్యాదులు చేశారని, వారి గ్రీవెన్స్‌ను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ అక్రమాలపై సీబీఐతో విచారణ చేసి నిజా నిజాలు నిగ్గుతేల్చాలని, తద్వారా అర్హులైన వారికి న్యా యం చేయాలన్నారు. డీఎస్సీని రద్దు చేసి మరోసారి నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు ‘ఒక్క పరీక్ష–వేల సందేహాలు’, పేపర్లు లీక్, డేటా డెలీట్, మెరిట్ లిస్టు మాయం అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వానికి వ్యతి రేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధర్నా అనంతరం వారు ఉన్నతాధికారులకు వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం కడప నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి షేక్ షఫీవుల్లా, ఆ పార్టీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి ఎం.గురుప్రసాద్ మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 1.73లక్షల సచివాలయ ఉద్యోగాలను ఎంతో పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని, కూటమి ప్రభుత్వం ఇచ్చింది ఒక్క నోటిఫికేషన్...16వేల ఉద్యోగాలే అయినా అనేక అక్రమాలు జరిగాయన్నారు. యువతను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు మెగా డీఎస్సీ పేరుతో వారి జీవితాల ను అంధకారంలోకి నెట్టారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షులు గురునాథరెడ్డి (ప్రొద్దుటూరు), చంద్ర ఓబుల్‌రెడ్డి(మైదుకూరు), ఈశ్వర్‌రెడ్డి(కమలాపురం), నరసింహారెడ్డి(బద్వేల్), హరీష్‌రెడ్డి(జమ్మలమడుగు), జిల్లా ఉపాధ్యక్షులు సందీప్, పఠాన్ ఖాన్, పార్టీ నాయకులు రహీమ్, అఖిల్, వంశీ, నాగేంద్ర ప్రసాద్, కంచుపాటి బాబు, చల్లా పవన్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో పాల్గొన్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, దేవిరెడ్డి ఆదిత్య తదితరులు
కలెక్టరేట్‌లో అధికారికి వినతిపత్రమిస్తున్న పార్టీ నేతలు


