పరేషన్‌కు ఏడాది | - | Sakshi
Sakshi News home page

పరేషన్‌కు ఏడాది

Jun 1 2026 3:55 AM | Updated on Jun 1 2026 3:55 AM

పరేషన్‌కు ఏడాది

జిల్లాలో రేషన్‌షాపులు, కార్డుల వివరాలు

రేషన్‌ ఏఏవై తెల్ల మొత్తం

షాపులు కార్డులు కార్డులు కార్డులు

1239 36,031 5,42,746 5,78,777

కడప సెవెన్‌రోడ్స్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న అసంబద్ధ నిర్ణయం వల్ల ఇంటింటికి రేషన్‌ సరుకుల పంపిణీ ఆగిపోవడంతో కారు్‌ాడ్దరులకు కష్టాలు ప్రారంభమై సోమవారానికి ఏడాది పూర్తి అవుతోంది. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీపీఎల్‌ కార్డుదారుల పాలిట శాపంగా మారింది. పేదలు పనులు వదులుకొని రేషన్‌షాపుల వద్ద గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. అలాగే జిల్లా వ్యాప్తంగా 366 ఎండీయూ వాహనాలు ఆగిపోవడంతో వాటిపై ఆధారపడి జీవిస్తున్న యువత ఉపాధి కోల్పొయి రోడ్డున పడాల్సి వచ్చింది. ప్రజా పంపిణీ వ్యవస్థను కూటమి ప్రభుత్వం పటిష్టం చేయకపోగా తమను కష్టాలపాలు చేసిందని పలువురు కార్డుదారులు వాపోతున్నారు.

ఒకప్పుడు వృద్ధులు, దివ్యాంగులు, రోజు కూలీలు తమ ఇళ్లకు అవసరమైన సరుకులు తెచ్చుకునేందుకు ఎఫ్‌పీ షాపుల వద్ద భారీ క్యూలలో గంటలకొద్ది పడిగాపులు కాసే పరిస్థితి ఉండేది. ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇంటింటికి రేషన్‌ పంపిణీ విధానానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో 366 మొబైల్‌ డిస్పెసింగ్‌ యూనిట్లు (రేషన్‌ సరుకులు సరఫరా చేసే వాహనాలు) ఏర్పాటు చేశారు. ఒక్కో వాహనం ద్వారా కనీసం ఇద్దరు ఉపాధి పొందేవారు. ఈ వాహనాలు తమకు కేటాయించిన ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి కార్డుదారులకు సరుకులు పంపిణీ చేసేవి. ఫలానా రోజు బియ్యం బండి వస్తుందనే సమాచారం వలంటీర్ల ద్వారా ప్రజలకు సమాచారం అందేది. దీంతో ప్రజలు ఆ సమయంలో ఇళ్ల వద్దనే ఉండి తమకు అందాల్సిన బియ్యం, చక్కెర, ఇతర నిత్యావసర వస్తువులను తీసుకునేవారు. కరోనా వైరస్‌ వ్యాపించినపుడు ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఆ సమయంలో బియ్యం బండ్లు ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయి. 2024 సాధారణ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరును ప్రజల్లో చెరిపేయడం కోసం ఆయన ముద్ర ఉన్న పలు పథకాలను రద్దు చేశారు. అందులో ఇంటింటికి రేషన్‌ పంపిణీ విధానం ఒకటి. 2027 వరకు ఎండీయూ వాహనాలు కొనసాగేందుకు ఒప్పందం ఉన్నప్పటికీ వాటిని రద్దుచేసి యువతను కూటమి ప్రభుత్వం రోడ్లపాలు చేసింది. దీంతో ఎండీయూ నిర్వాహకులు మరో ఉపాధి కానరాక, కుటుంబాల పోషణ భారంగా పరిణమించింది. వైఎస్‌ జగన్‌ హయాంలో ఉచిత బియ్యంతోపాటు కార్డుదారులకు చక్కెర, కందిబేడలు, గోధుమపిండి, జొన్నలు, రాగులు వంటివి కూడా పంపిణీ చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కేవలం బియ్యం, చక్కెరతోనే సరిపెడుతోంది. గతంలో ఎండీయూ వాహనాల ద్వారా తక్కువ ధరతో కందిబేడలు పంపిణీ చేశారు. ఇప్పుడు ఎఫ్‌పీ షాపుల ద్వారా కందిబేడలు సరఫరా చేయకపోవడంతో ప్రజలు బహిరంగ మార్కెట్‌లో కిలో రూ. 170–180తో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

రేషన్‌ కోసం తప్పని తిప్పలు

గత ప్రభుత్వ హయాంలో ఇంటి వద్దకే వచ్చి రేషన్‌ సరుకులు పంపిణీ చేసేవారు. ఈ విధానం పేదలకు ఎంతో ఉపయుక్తంగా ఉండేది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన త తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన ఎండీయూ వాహనాలను రద్దు చేసి మళ్లీ పాత విధానాన్ని పునరుద్ధరించారు. ఇందువల్ల రేషన్‌కార్డుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. – వడ్ల భాగ్యలక్ష్మి, కడప

ఆ విధానమే బాగుండేది

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన బియ్యం బండ్ల విధానమే బాగుండేది. ఇంటి ముంగిటికే సరుకులు వచ్చేవి. కరోనా కష్టకాలంలో ఇది ఎంతో ఉపయోగపడింది. చంద్రబాబు వచ్చిన తర్వాత బియ్యం బండ్లను రద్దు చేయడంతో పనిపాట చేసుకుని బతికే పేదలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

– టి.వెంకట సుబ్బమ్మ, రామరాజుపల్లె, కడప

366 ఎండీయూ వాహనాల నిలిపివేత

ఉపాధి కోల్పోయిన యువత

ఎఫ్‌పీ షాపుల చుట్టూ కార్డుదారుల ప్రదక్షిణలు

Advertisement
 
Advertisement
Advertisement