నేడు డయల్‌ యువర్‌ కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు డయల్‌ యువర్‌ కలెక్టర్‌

Jun 1 2026 3:55 AM | Updated on Jun 1 2026 3:55 AM

నేడు డయల్‌ యువర్‌ కలెక్టర్‌ ఏపీపీజీసెట్‌లో ప్రతిభ నేడు ’డయల్‌ యువర్‌ ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ రెడ్డెమ్మా..కరుణించమ్మా కాల్‌ సెంటర్‌ సేవలను వినియోగించుకోవాలి

కడప సెవెన్‌రోడ్స్‌: డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9.30 నుంచి ఉదయం 10.00 గంటల వరకు జరుగుతుందని డీఆర్‌ఓ మల్లికార్జునుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు 08562 –244437 ల్యాండ్‌ లైన్‌ నెంబరుకు ఫోన్‌ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని డీఆర్వో పేర్కొన్నారు.

రాజంపేట టౌన్‌: రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బోటనీ మేజర్‌గా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన దుగ్గినేని శ్రావణి ఏపీపీజిసెట్‌లో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు సాధించింది. శ్రావణి 100కు 99 మార్కులు సాధించారు. ఇదే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జువాలజీ మేజర్‌గా గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన ఆయేషా కౌసర్‌ రాష్ట్రస్థాయిలో పదో ర్యాంక్‌ సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ బీ.పురుషోత్తం తెలిపారు. విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివితే ఎంతటి లక్ష్యాన్ని అయినా సాధించగలరని ఆయన పేర్కొన్నారు.

కడప కార్పొరేషన్‌: విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ’డయల్‌ యువర్‌ సీఎండీ’ కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్‌ నిర్వహించనుంది. ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ సీఎండీ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు 8977716661 నంబర్‌కు కాల్‌ చేసి తమ విద్యుత్‌ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చు.

సర్కిల్‌ స్థాయిలోనూ

డయల్‌ యువర్‌ ఎస్‌ఈ

డయల్‌ యువర్‌ ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ కార్యక్రమంతోపాటు సర్కిల్‌ స్థాయిలో కూడా ప్రతి సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 వరకు ’డయల్‌ యువర్‌ ఎస్‌ఈ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో తమ విద్యుత్‌ సమస్యలను సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ దృష్టికి తీసుకొచ్చేందుకు వీలుగా వినియోగదారులు అన్నమయ్య: 9440817449, కడప: 08562242457 నంబర్లకు ఫోన్‌ చేయాల్సి ఉంటుంది.

గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా ప్రఖ్యాతిపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది.అమ్మా..కరుణించమ్మా అని వేడుకున్నారు. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు. భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరసారెలతో మొక్కులు చెల్లించుకొన్నారు. కర్ణాటక, తమిళనాడుతో పాటు రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు.

కడప సెవెన్‌రోడ్స్‌: సోమవారం కలెక్టరేట్‌లో జరిగే కాల్‌ సెంటర్‌, ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రజలు వినియోగించుకోవాలని డీఆర్‌ఓ మల్లికార్జునుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా,లేదా తమ ఫిర్యాదులకుసంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్‌ చేయవచ్చునన్నారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్‌ (మీకోసం డాట్‌ ఏపీ డాట్‌ జివో వి డాట్‌ ఇన్‌) వైబ్సెట్‌లో తమ అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు.

● సోమవారం కలెక్టరేట్‌లోని సభా భవన్‌లో ప్రజాసమస్యలపరిష్కార వేదిక (పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రీడ్రసెల్‌ సిస్టం, పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లాఅధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రజలు సమస్యలకుసంబంధించి అర్జీలను అందజేయాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement