పులివెందుల: రాష్ట్రాన్ని అన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్‌తోపాటు వారి అనుచరులు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం పులివెందులలోని తన స్వగృహం వద్ద ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ అంటూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవడం జరిగిందన్నారు. అర్హులైన అభ్యర్థులకు మోసం చేసి డీఎస్సీ ఉద్యోగాలను పెద్ద ఎత్తున అమ్ముకున్నారని ఆరోపించారు. అర్హులైన అభ్యర్థులకు కాల్‌లెటర్లు పంపి సర్టిఫికెట్లు కూడా పరిశీలించిన తర్వాత వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా పెద్ద ఎత్తున స్కామ్‌కు పాల్పడటం జరిగిందన్నారు. చంద్రబాబుకు తన తప్పులు బయటపడగానే డైవర్షన్ పాలిటిక్స్ చేయడం వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఆయన చేస్తున్న అనైతిక కార్యక్రమాలు బయటపడగానే వెంటనే వైఎస్సార్ సీపీ నాయకులపై అక్రమ కేసులు, ఎల్లో మీడియా ద్వారా విషపు రాతలు మొదలుపెట్టి డైవర్షన్ చేస్తారన్నారు. ఇప్పుడు కూడా అలాగే డీఎస్సీ స్కామ్ బయట పడగానే అక్రమ మద్యం కేసుల పేరుతో టాపిక్ డైవర్షన్ చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తన తప్పు కప్పి పుచ్చుకోనడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన బురదచల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నిస్తే బాధ్యతగా అందుకు సమాధానాలు చెప్పకుండా చంద్రబాబునాయుడుతోపాటు ఆయన అనుచరులు ఏమాత్రం సంబంధం లేని విషయాలను తెరపైకి తెచ్చి పచ్చి అపద్ధాలతో ఎదరుదాడి చేస్తున్నారన్నారు. చేసిన తప్పులకు సమాధానం చేప్పే ధైర్యం లేక ఇలాంటి నీచ రాజకీయాలు చేయడం అలవాటుగా మార్చుకున్నారన్నారు. గడిచిన రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. అనంతరం ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. ఇటీవల పార్టీ పదవులు పొందిన వారిని అభినందించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ యూత్ విభాగం నాయకులు ఆయనను కలిశారు.
‘వెన్నుపోటుకు రెండేళ్లు’ జయప్రదం చేయండి
చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనకు నిరసనగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు తలపెట్టిన ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమంలో జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలన్నారు. చంద్రబాబు రెండేళ్ల పాలనలో ప్రజలకు చేసిన మోసాలను వివరించాలన్నారు.
రాష్ట్రాన్ని అన్ని విధాలుగాదోచుకుంటున్న కూటమి నేతలు
ప్రశ్నిస్తే సమాధానంచెప్పకుండా ఎదురుదాడి
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి


