110 ఏళ్ల తర్వాత పెద్దమ్మ దేవర | - | Sakshi
Sakshi News home page

110 ఏళ్ల తర్వాత పెద్దమ్మ దేవర

Jun 1 2026 3:55 AM | Updated on Jun 1 2026 3:55 AM

సింహాద్రిపురం : సింహాద్రిపురం మండల పరిధిలోని బిదినంచెర్లలో 110 ఏళ్ల తర్వాత పెద్దమ్మ దేవరను ఆదివారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో మాట్లాడుతూ 110 ఏళ్ల తర్వాత దేవర జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. గ్రామ దేవతల ఆశీస్సులు ప్రజలపై ఉంటాయన్నారు. గ్రామాభివృద్ధికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. అనంతరం ఆయన స్థానిక వైఎస్సార్‌ సీపీ నాయకులు బ్రహ్మానందరెడ్డి, జెడ్పీటీసీ ఝాన్సీరాణి, కేశవరెడ్డి పెద్దిరెడ్డి ఇళ్లకు వెళ్లారు. ఆయన వెంట వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, మండల వైఎస్సార్‌ సీపీ నాయకులు, వివిధ గ్రామాల నాయకులు ఉన్నారు. అంతకుముందు ఆయన గ్రామంలోకి రాగానే మహిళలు, నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున బాణసంచా పేలుస్తూ, పూలమాలలతో డప్పు వాయిద్యాల మధ్య ఘన స్వాగతం పలికారు. 110 ఏళ్ల తర్వాత జరుగుతున్న దేవర కావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్‌ఐ డాక్టర్‌ నాయక్‌, తొండూరు ఎస్‌ఐ మద్దిలేటి, లింగాల ఎస్‌ఐ జగదీశ్వర్‌రెడ్డి చర్యలు తీసుకోవడంతో దేవర ప్రశాంతంగా ముగిసింది.

అమ్మవారిని దర్శించుకున్న

ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement