గుర్తు తెలియని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వ్యక్తి మృతి

Jun 1 2026 3:55 AM | Updated on Jun 1 2026 3:55 AM

నందలూరు : నూతనంగా నిర్మించిన రైల్వే అండర్‌ బ్రిడ్జి పైనుంచి పడి గుర్తు తెలియని వ్యక్తి(యాచకుడు) మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఏరుకొని జీవనం సాగించే ఈ వ్యక్తి అండర్‌ బ్రిడ్జి గోడపై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుడిని 108 వాహనంలో రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి గురించి ఎటువంటి సమాచారం లభించలేదని పోలీసులు తెలిపారు. ఎవరైనా ఆచూకీ గుర్తిస్తే తమను సంప్రదించాలని చెప్పారు. ఆర్‌యుబీ గోడపైన క్లోజ్‌ చేయకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.

శివాలయంలో

కొండ చిలువ కలకలం

ముద్దనూరు : మండల పరిధి చింతకుంట గ్రామంలోని కొండపై వెలసిన శివాలయంలో ఆదివారం కొండ చిలువ కలకలం సృష్టించింది. కొండచిలువను చూసిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అనంతరం గ్రామస్తులే కొండచిలువను కొండలో వదిలినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. గ్రామ శివారు, కొండ ప్రాంతం కావడంతో సర్పాలు, విష పురుగుల సంచారం అధికంగా ఉంటుందని స్థానికులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement