జమ్మలమడుగు : విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని, ప్రతి ఒక్కరూ చదువుకుని ఉన్నత స్థాయికి రావాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడూ చెబుతుంటారని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ముద్దనూరు రోడ్డులోని నానుబాల యల్లప్ప ఫంక్షన్ హాల్‌లో రజక సంఘం అధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ఏడాది పదో తరగతి, ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను రజక సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు లోగిడి జయన్న, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజ్జల లక్షుమయ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు అందజేశారు. అనంతరం ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ నిరుపేదల కుటుంబాలు బాగు పడాలంటే ఆ కుటుంబంలోని పిల్లలు బాగా చదువుకోవాలని తెలిపారు. తల్లిదండ్రుల కష్టాలకు తగిన ప్రతిఫలం సాధించేలా విద్యార్థులు కృషి చేయాలన్నారు. ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోలన్నారు. పేదలకు ఇంగ్లిషు మీడియం విద్య అవసరాన్ని గుర్తించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెట్టి ఉచితంగా పుస్తకాలు, స్కూల్ యూనిఫాం, షూ, బ్యాగులు అందించారన్నారు. ఇలాంటి ప్రతిభా పురస్కారాలు నిరుపేద పిల్లలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. అనంతరం జమ్మలమడుగు, పులివెందుల ప్రాంతాల్లో పది, ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించిన 36 మందికి రూ.10 వేలు, రూ.8 వేలు, రూ.6 వేల చొప్పున నగదుతో పాటు ప్రతిభాపురస్కారాలను అందించారు. కార్యక్రమంలో ఎస్‌ఈసీ సభ్యుడు గిరిధర్‌రెడ్డి, జిల్లా అఽధికార ప్రతినిధి కొమెర్ల మోహన్‌రెడ్డి, జడ్పీటీసీ మహాలక్ష్మీ, పోచిరెడ్డి, జానీ, ఫయాజ్, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్లు గుర్విరెడ్డి, రమణారెడ్డి, ధన్నవాడ మహేశ్వరరెడ్డి, రఘునాథ్‌రెడ్డి, తలమంచిపట్నం వినయ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి


