విచారణకు ఆదేశం | - | Sakshi
Sakshi News home page

విచారణకు ఆదేశం

May 31 2026 1:24 AM | Updated on May 31 2026 1:24 AM

విచారణకు ఆదేశం

కడప అగ్రికల్చర్‌: వైఎస్సార్‌జిల్లా వేంపల్లె మండలం చింతలమడుగుపల్లె ప్రైమరీ అగ్రికల్చర్‌ కార్పొరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రామిరెడ్డి అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణల వచ్చాయి. ఈ మేరకు ఆయనపై విచారణ చేయాలని కమిటీని ఆదేశించినట్లు జిల్లా కోపరేటివ్‌ ఆఫీసర్‌ ఎం. వెంకటసుబ్బయ్య తెలిపారు.

శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం

ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శనివారం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అర్చకులు శ్రావణ్‌ కుమార్‌, పవన్‌ కుమార్‌ మూల విరాట్‌లను టీటీడీ అధికారులు తీసుకొచ్చిన పట్టువస్త్రాలు, బంగారు ఆభరాణాలు, తులసి మూలవిరాట్‌లను గజమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు.

దేశాభివృద్ధిలో మీడియా కీలకపాత్ర పోషించాలి

కలెక్టర్‌కడప సెవెన్‌రోడ్స్‌: దేశాభివృద్ధిలో మీడియా కీలకపాత్ర పోషించాలని కడప జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి సూచించారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో మీడియా అకాడమి చైర్మన్‌ ఆలపాటి సురేష్‌కుమార్‌ అధ్యక్షతన జిల్లా గ్రామీణ విలేకరుల రెండురోజుల పునశ్చరణ శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ.. వార్తలు కేవలం ప్రభుత్వ పరిపాలనకే కాకుండా, ప్రజల జీవితాలను ప్రభావితం చేసేలా కనీసం 70 శాతం ఉపయోగకరంగా ఉండాలన్నారు. మీడియా అకాడమి చైర్మన్‌ ఆలపాటి సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ పాత్రికేయులు ప్రజాస్వామ్యానికి వాచ్‌డాగ్స్‌గా నిలవాలన్నారు. వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ నిష్పాక్షిక సమాచారంతో మీడియా విశ్వసనీయతను కాపాడుకోవాలన్నారు. సీనియర్‌ పాత్రికేయులు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మీడియా వ్యవస్థకు గ్రామీణ జర్నలిస్టులే మూలస్తంభాలన్నారు.మరో సీనియర్‌ పాత్రికేయుడు రాఘవశర్మ మాట్లాడుతూ.. తెలుగు వ్యాకరణంపై అవగాహన పెంచుకుని, మాండలిక పదాలతో, సరళమైన పదజాలంతో వార్తా రచన చేయాలని సూచించారు. కడప సైబర్‌ క్రైమ్‌ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ మధుమల్లేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో మీడియా పాత్ర కీలకమన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement